టాక్ : ‘సలార్’ టీమ్ నుండి సర్ప్రైజ్ రానుందా ?

Published on May 28, 2023 12:01 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ సలార్. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యధిక వ్యయంతో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి భువన్ గౌడ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, మధు గురుస్వామి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని జూన్ 16 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఆదిపురుష్ మూవీకి అటాచ్ చేయనున్నారనే న్యూస్ ఇప్పటికే సినీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. కాగా దీనికి సంబంధించి జూన్ ఫస్ట్ వీక్ లో మేకర్స్ నుండి ఒక సర్ప్రైజ్ అప్ డేట్ రానుందని అంటున్నారు. అయితే దీని పై సలార్ మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :