సర్ప్రైజ్ : విజువల్స్ లేకుండా ఉపేంద్ర ‘UI’ టీజర్ రిలీజ్

Published on Sep 19, 2023 1:00 am IST

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మన తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో సుపరిచితం. అప్పట్లో కన్యాదానం సినిమాలో మంచి నటనతో ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా క్రేజ్ అందుకున్న ఉపేంద్ర అనంతరం పలు డబ్బింగ్ మూవీస్ ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి మరింత సుపరిచితం అయ్యారు. ఇక ఇటీవల సన్ ఆఫ్ సత్యమూర్తి, గని సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ UI. నేడు ఉపేంద్ర బర్త్ సందర్భంగా ఈ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, ఎప్పుడూ డిఫరెంట్ గా తన సినిమాల విషయమై ఆలోచన చేసే ఉపేంద్ర ఈ టీజర్ ని కేవలం ఆడియోతో మాత్రమే రిలీజ్ చేసారు. అయితే విజువల్స్ లేకుండా రిలీజ్ అయిన UI టీజర్ అరుపులు కేకలతో సస్పెన్స్, టెన్షన్ టెన్షన్ గా సాగింది. అయితే టీజర్ క్లైమాక్స్ లో ఇది AI ప్రపంచం కాదు UI ప్రపంచం, తప్పించుకునేందుకు ఊహాజనితమైన ఆలోచనలు చేయండి అంటూ ఒక లేడీ వాయిస్ వస్తుంది. మొత్తంగా UI టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటూ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటెర్టైనర్స్ బ్యానర్స్ పై జి మనోహరన్, కెపి శ్రీకాంత్ గ్రాండ్ గా నిర్మించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :