రవితేజ ‘రావణాసుర’ మూవీకి A సర్టిఫికెట్

Published on Mar 31, 2023 8:34 pm IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, పూజితా పొన్నాడ, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రావణాసుర. భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని సుధీర్ వర్మ తెరకెక్కించగా ఆర్టి టీమ్ వర్క్స్ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. షూటింగ్ బిగినింగ్ నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన రావణాసుర మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి.

కాగా విషయం ఏమిటంటే, ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి కాగా దీనికి సెన్సార్ వారు A సర్టిఫికెట్ ని కేటాయించారు. అయితే ఇందులో వయొలెంట్ అంశాలు ఉండడంతోనే సెన్సార్ వారు A సెర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రన్ టైం మొత్తం 2 గం. 21 ని. లు గా ఉండనుంది. మరి రిలీజ్ తరువాత రావణాసుర ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :