
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ‘అంజాన్’. ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఏ సినిమాకైనా నష్టాన్ని కలిగించేది పైరసీ.. అందుకే అంజాన్ టీం సౌత్ ఇండియాలో మొట్ట మొదటి సారిగా పైరసీ అయ్యే చాన్స్ లేకుండా అంజాన్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే ‘ అంజాన్ సినిమా సౌత్ ఇండియాలో డిజిటల్ రెవల్యూషన్ తీసుకొని వస్తుంది. ఈ సినిమాని కేవలం డిజిటల్ స్క్రీన్స్ ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంజాన్ సినిమాని ఒక్క ఫిజికల్ ప్రింట్ తో కూడా రిలీజ్ చెయ్యడం లేదు. దీనివల్ల ఈ సినిమా పైరసీ ఎక్కడ చేస్తున్నా ఈజీగా తెలుసుకోవచ్చు. డిజిటల్ సినిమా ద్వారా అయితే ప్రింట్ కి కాపీరైట్ ఉంటుంది. ప్రతి ప్రింట్ కి ఓ స్పెషల్ కోడ్ ఉంటుంది. అందుకే ఈజీగా పైరసీ చేసేవాళ్ళని పట్టుకోవచ్చని’ యుటివి అధినేత ధనంజయ్ తెలియజేశారు.