కొత్త సినిమా ఎప్పుడు మొదలయ్యేది చెప్పిన సూర్య !

7th, January 2018 - 03:10:00 PM

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘తాన సెరెంద కూట్టం’ చిత్రం తెలుగులో కూడా ‘గ్యాంగ్’ పేరుతొ ఈ నెల 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వరుస సినిమాలని రెడీ చేసుకుని పెట్టుకున్నారు సూర్య. త్వరలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని మొదలుపెట్టనున్న సూర్య ఆ తరవాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కెవి. ఆనంద్ చిత్రాన్ని స్టార్ చేస్తానని అంటున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ చిత్రాన్ని మొదలుపెడతామని అన్నారు. కెవి. ఆనంద్ గతంలో సూర్యతో ‘బ్రదర్స్, వీడొక్కటే’ వంటి సెన్సేషనల్ చిత్రాల్ని తెరకెక్కించారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ పై మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇది మాత్రమే కాకుండా ‘సింగం’ ఫేమ్ హరి, విక్రమ్ కుమార్ లతో కూడా సినిమాలు చర్చలు దశలో ఉన్నాయని చెప్పుకోచ్చారు సూర్య.