సూర్య తెలుగులో సొంతంగా డబ్బింగ్ !

14th, December 2017 - 12:37:31 PM

తమిళ హీరో సూర్య కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. తాజాగా సూర్య నటించిన ‘తానా సెరెంద కూట్టమ్‌’ సినిమా తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో విడుదలకానుంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ మూవీ టిజర్ కు మంచి రెస్పోన్స్ లభిస్తోంది.

రమ్యకృష్ణ ఈ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతోంది. మొదటిసారి సూర్య ఈ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో ఈ నెల చివరి వారంలో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.