కె వి ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ పొల్లాచిలో జరుగుతుంది. ఈ చిత్రంలో సూర్య ఎన్ ఎస్ జి కమాండో పాత్రలో నటిస్తున్నాడు. ఇక ‘సింగం’ సిరీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టిన సూర్య ఈసినిమాలో కూడా మరో సారి అలాంటి పాత్రలోనే నటిస్తుండడంతో ఆయన అభిమానులు ఈచిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు .
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఆర్య , ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి హారిస్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో సూర్య కు జోడిగా సయేశా నటిస్తుంది. ఈచిత్రం ఏప్రిల్ 14న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.
ఇక సూర్య నటిస్తున్న 36 వచిత్రం ‘ఎన్‌జికె’ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
