ట్రెండింగ్ : ‘వాడి వాసల్’ మేకింగ్ వీడియోలో అదరగొట్టిన సూర్య

Published on Jul 23, 2022 9:00 pm IST

తమిళ స్టార్ యాక్టర్ సూర్య గత సినిమా ఆకాశం నీహద్దురాలో కనబరిచిన అద్భుత నటనకు గాను ఆయనకి నిన్న కేంద్రప్రభుత్వం నుండి జాతీయ అవార్డ్ ప్రకటించిన అనౌన్స్ మెంట్ రావడం జరిగింది. నేడు సూర్య పుట్టిన రోజు కావడంతో ఈ అవార్డు తన జీవితంలో మరిచిపోలేని పుట్టినరోజు కానుకగా నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన నోట్ లో తెలిపారు సూర్య. ఇక మరోవైపు ప్రస్తుతం వెట్రిమారన్ తో సూర్య చేస్తున్న మూవీ వాడి వాసల్.

తమిళనాడు సంప్రదాయంలో భాగమైన ఆట జల్లికట్టు నేపథ్యంలో సాగె యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క మేకింగ్ వీడియోని నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. వి క్రియేషన్స్ సంస్థ పై కలైపులి ఎస్ థాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియోలో పందెపు ఎద్దుని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్న సూర్య క్లిప్స్ చూడవచ్చు. ఈ క్యారెక్టర్ కోసం సూర్య ఎంతో కష్టపడ్డట్లు తెలుస్తోంది. త్వరలో టీజర్ రిలీజ్ కానున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :