కన్ఫర్మ్.. సూర్య సరసన ఇద్దరు హీరోయిన్లు !

5th, January 2018 - 04:40:59 PM

ఈ నెల 12వ తేదీన సూర్య ‘గ్యాంగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈయన సెల్వ రాఘవన్ తో సినిమాను ప్రారంభించారు. ముందుగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కుదరగా మధ్యలో సాయి పల్లవి కూడా నటిస్తొయిందనే వార్తలొచ్చాయి.

కానీ సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ స్థానంలో నటిస్తుందా లేకపోతె చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా అనే విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చింది. అదేమిటంటే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ తో పాటు సాయి పల్లవి కూడా నటిస్తుందట. అంటే ఈసారి సూర్య ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారన్నమాట. ప్రసుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించనున్నారు.