ఇంటర్వ్యూ : పెర్లెన్ భేసానియా – నిహారిక చాలా జన్యూన్ !

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. మార్చి 29 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సెకెండ్ హీరోయిన్ పెర్లెన్ భేసానియా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

మీ గురించి చెప్పండి ?

మాది బాంబే. నేను లా స్టూడెంట్ ని కూడా. కానీ యాక్టింగ్ మీద ఇష్టంతో ఈ ఫీల్డ్ లోకి వచ్చాను.

ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశారా ?

లేదండి. సూర్యకాంతమే నా ఫస్ట్ ఫిల్మ్. కాకపోతే కొన్ని యాడ్స్ లో అలాగే ఫ్రెండ్స్ కోసం ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ లో చేశాను. అంతకు మించి ఇంకేం ఎక్స్ పీరియన్స్ లేదు.

ఈ సినిమాలో మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది ?

నేను బాంబేలోనే మోడలింగ్ చేస్తుండగా.. మేనేజర్ ద్వారా సూర్యకాంతం టీమ్ ను కలిసాను. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తరువాత ఆడిషన్స్ తీసుకున్నారు. వాళ్ళు అనుకున్న పాత్రలో నేను షూట్ అవుతానని నన్ను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు.ఎంపిక చేసే ముందు రాహుల్ కి నాకు ఫోటో షూట్ కూడా చేశారు.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఈ సినిమాలో పూజ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తానొక సెన్సిటీవ్ గర్ల్. ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ పై డిపెండ్ అవుతుంది. నిజ జీవితంలో నా క్యారెక్టర్ కి సినిమాలో క్యారెక్టర్ కి చాలా వ్యత్యాసం ఉంది.

ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా ?

లేదు అండి. కథలో భాగంగా మా పాత్రల మధ్య వచ్చే డ్రామాకి సంబంధిచిన కథే తప్ప.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కాదు.

నిహారిక గురించి చెప్పండి ?

నేను చాలా నిజాయితీగా చెబుతున్నాను. ఒక పర్సన్ గా ఒక యాక్టర్ గా నిహారిక చాలా జన్యూన్. చాలా కోపరేట్ చేసింది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే రాహుల్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశాడు.

సినిమాలో మీ పాత్రకు నిహారిక పాత్రకు తేడా ఏమిటి ?

చాలా తేడా ఉంది. ఎందుకంటే రెండు పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి.

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

ఇంకా ఏ మూవీ ఒప్పుకోలేదు అండి. కొన్ని ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. సూర్యకాంతం రిలీజ్ తరువాతే క్లారిటీ వస్తోంది.

Exit mobile version