సూర్య “జై భీమ్” మరో ఘనత

Published on Jan 19, 2022 11:09 pm IST

స్టార్ హీరో సూర్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జై భీమ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

తాజా వార్తతో నటుడు సూర్య అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. రీసెంట్‌గా ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమా స్పెషల్ ఫీచర్ అప్‌లోడ్ చేయబడింది. ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక తమిళ చిత్రం జై భీమ్ మాత్రమే.

సంబంధిత సమాచారం :