నంబర్ వన్ పొజిషన్ లో సూర్య “జై భీమ్”

Published on Nov 15, 2021 5:31 pm IST


సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జై భీమ్. 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య మరియు జ్యోతిక లు నిర్మించడం జరిగింది. నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అయిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. లిజోమోల్ జోస్, మనికందన్, రజిష విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సీన్ రోల్దాన్ సంగీతం అందించారు.

తాజాగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. జై భీమ్ ఇప్పుడు అత్యధిక IMDB రేటింగ్ పొందిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం 9.6 రేటింగ్ తో టాప్ లో ఉంది. 83 వేలకు పైగా ఓట్ల తో టాప్ లో కొనసాగుతోంది. సూర్య హీరోగా నటించిన సూరారై పొట్రు చిత్రం సైతం 9.1 రేటింగ్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

సంబంధిత సమాచారం :

More