ఆస్కార్స్ లిస్ట్ లోకి సూర్య “జై భీమ్”

Published on Jan 21, 2022 1:30 pm IST

సూర్య ప్రధాన పాత్రలో టి. జే. జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఆస్కార్స్ లిస్ట్ లో చేరడం జరిగింది. గతేడాది సూర్య హీరోగా నటించిన సూరారై పొట్రు చిత్రం కూడా ఆస్కార్స్ లిస్ట్ లో చేరిన సంగతి అందరికి తెలిసిందే.

సూర్య వరుస చిత్రాలు ఆస్కార్స్ కి ఎంపిక అవ్వడం పట్ల అభిమానులు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 276 చిత్రాలు 94 వ అకాడమీ అవార్డు నామినేషన్ లో ఉన్నాయి. 2 డి ఎంటర్ టైన్మెంట్ పతాకం పై జ్యోతిక, సూర్య లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :