ఈరోజు సాయంత్రం విడుదలకానున్న సూర్య సినిమా ఫస్ట్ లుక్ !
Published on Dec 1, 2017 4:15 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘తన్న సెరెంద కూటం’ అనే సినిమా చేస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు భారీ స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉండటంతో ఆ సినిమాను తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో విడుదలచేయనున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తోంది. ఈ చిత్రం యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి రమ్యక్రిష్ణ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

 
Like us on Facebook