మాస్ మహారాజా “రావణాసుర” కి డబ్బింగ్ షురూ చేసిన సుశాంత్!

Published on Feb 9, 2023 4:00 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రావణాసుర. ఈ చిత్రం లో టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ను సుశాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం కి డబ్బింగ్ ను షురూ చేసినట్లు తెలిపారు.

తన పాత్రకి సంబందించిన ఒక ఆసక్తికర ఫోటో ను షేర్ చేశారు. తన బ్యాక్ సైడ్ కనపడేలా ఈ ఫోటో ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన రావణాసుర అంతెం కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 7, 2023 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం లో అను ఇమ్మన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :