సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “ఇచ్చట వాహనములు నిలుపరాదు”

Published on Aug 17, 2021 3:00 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” చిత్రంతో మంచి హిట్ అందుకున్న మరి హీరో సుశాంత్. మంచి కం బ్యాక్ అందుకున్న సుశాంత్ ఆ చిత్రం అనంతరం రిలీజ్ కి రెడీ చేసిన చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఎస్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ఆగష్టు 27న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ యూనిట్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చోదరీ హీరోయిన్ గా నటించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. అలాగే ఏ ఐ స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :