ఆకట్టుకుంటున్న సుశాంత్ “మా నీళ్ల ట్యాంక్” టీజర్

Published on Jun 28, 2022 5:27 pm IST

సుశాంత్‌ హీరోగా నటిస్తున్న మా నీళ్ల ట్యాంక్‌ కి సంబంధించిన టీజర్‌ ను మేకర్స్ తాజాగా విడుదల చేయడం జరిగింది. అల వైకుంఠపురములో సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో, ఈ సిరీస్‌తో సుశాంత్ తన OTT అరంగేట్రం చేస్తున్నాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

టీజర్ ను చూస్తుంటే, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఉంది. బ్యాక్‌డ్రాప్, కామిక్ డైలాగ్‌లు మరియు విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సిరీస్‌లో సుశాంత్ పోలీసుగా కనిపించనున్నాడు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తుండగా, సుదర్శన్, నిరోష, ప్రేమ్ సాగర్, రామరాజు, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్న ఈ సీరీస్ కి వరుడు కావలెను ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఈ సిరీస్ జూలై 15న జీ లో ప్రీమియర్ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :