ఎమోషనలైన మాజీ విశ్వ సుందరి !

Published on Dec 19, 2021 10:06 pm IST

మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ తండ్రి పుట్టినరోజు నేడు. అయితే, ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్మితా సేన్ ఎమోషనల్ మెసేజ్ ను పోస్ట్ చేసింది. ‘హ్యాపీ బర్త్‌ డే బాబా. మీరు ప్రేమతో నిండిన అద్భుతమైన వ్యక్తి. మీరు నా తండ్రి కావడం, అలాగే నా పిల్లలకు మీరు తాతా కావడం నేను చేసుకున్న అదృష్టం. మీరు గొప్ప అల్టిమేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌. ఇక మీలోని ప్రశాంతత ఎప్పటికీ అలాగే ఉండాలి.

అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగా, పూర్తి ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీరే నాకు అద్భుతమైన తండ్రి. ఐ లవ్‌ యూ. మీ కూతురిగా నన్ను పుట్టించినందుకు దేవుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ సుస్మితా సేన్ ఎమోషనల్‌ మెసేజ్ ను పోస్ట్‌ చేసింది. అదే విధంగా తన తండ్రితో దిగిన ఒక ఆసక్తికర ఫోటోను కూడా ఆమె నెటిజన్లతో పంచుకుంది.

సంబంధిత సమాచారం :