మళ్లీ బిజీ కావడానికి క్రేజీ హీరోయిన్ ప్రయత్నాలు !

Published on Oct 11, 2021 8:16 pm IST

తెలుగు సినిమాల్లో మళ్లీ బిజీ కావడానికి హీరోయిన్ ఇలియానా కసరత్తులు చేస్తోంది. ఆ మధ్య అంథాదూన్ రీమేక్ లో నటించే ఛాన్స్ వస్తే.. అంగీకరించలేదు. అయితే, ఇలియానా కథల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోందట, ముఖ్యంగా తన క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందట. అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అవకాశాలు వస్తే.. నటించడానికి ఇలియానా ఆసక్తిగా ఉంది. లేదా స్టార్ హీరోల సినిమాల్లోనే ఛాన్స్ లు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది .

అయితే, ఇలియానా తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలకే ఎక్కువగా పరిమితం అయింది. కనీసం ఇప్పుడైనా కొత్త క్యారెక్టర్లతో ప్రయోగాలు చేయకపోతే, తనలోని నటికి న్యాయం చేయలేను అని ఫీల్ అవుతుందట. అందుకే త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతుంది ఇలియానా. ఆమె మెయిన్ లీడ్ గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ డిటైల్స్ తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :