Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
‘సువ‌ర్ణ‌సుంద‌రి’ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కూ.. !
Published on May 24, 2019 9:00 pm IST

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. .

ఈ సందర్బంగా.. నిర్మాత ల‌క్ష్మీ మాట్లాడుతూ… సువర్ణ సుందరి చిత్ర సెన్సార్ కంప్లీట్ అయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. బ‌డ్జెట్ ను మించి క్వాలిటి ఔట్ పుట్ రావటం సినిమా సక్సెస్ పై కాన్పిడెన్స్ ను పెంచిందన్నారు.

దర్శకుడు ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి లాంటి కంటెంట్ ఉన్న సినిమాకు నేను డైరెక్ట‌ర్‌ గా వర్క్ చెయటం గర్వంగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే అన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ః ఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ః సాయికార్తిక్‌, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్ః ప్ర‌వీణ్‌పూడి, స్టోరీః ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, డైరెక్ట‌ర్ః ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.


సంబంధిత సమాచారం :