మహేష్, వంశీ లు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు

Published on Oct 25, 2021 4:40 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, అల్లరి నరేష్ కీలక పాత్ర లో నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రం కి ఉత్తమ పాపులర్ చిత్రం గా నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు నిర్మాతలు మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి అవార్డ్ అందుకొనెందుకు హాజరు అయ్యారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సోషల్ మీడియా వేదిక గా ఈ చిత్రం కి నేషనల్ అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది.

సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం గా మహర్షి చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకోవడం నిజంగా మాకు గర్వకారణం అని తెలిపింది. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కు, దర్శకుడు వంశీ పైడిపల్లి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. మీరు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు అంటూ పేర్కొనడం జరిగింది. మహేష్ బాబు అభిమానులు అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More