సర్కారు వారి పాట: మహేష్ లుక్స్ పై ఎడిటర్‌ మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Apr 29, 2022 8:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానుండగా, ఇప్పటికే ప్రమోషన్స్ కూడా భారీగానే మొదలయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర ఎడిటర్‌ మార్తాండ్‌ కె వెంకటేష్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇప్పటి వరకు మహేష్‌బాబు లుక్‌ ది బెస్ట్‌గా ఉందని, సినిమాలో స్టార్‌ హీరో సూపర్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తాడని అన్నారు. ప్రముఖ ఎడిటర్ కూడా సినిమా బాగా వచ్చిందని, యూత్‌ఫుల్, ఫ్యామిలీ, రొమాంటిక్ సన్నివేశాలు సమాన పరిమాణంలో ఉంటాయని చెప్పారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :