ఫైట్ సీన్ తో షూటింగ్ షురూ చేసిన మహేశ్ “సర్కారు వారి పాట”

Published on Aug 13, 2021 6:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ అంటూ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపించారు. డైలాగ్ డెలివరీ పవర్ ఫుల్ గా ఉండటం మాత్రమే కాకుండా, డైరెక్టర్ పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశారు.

బ్లాస్టర్ ఇచ్చిన బూస్ట్ అప్ తో ఈ చిత్రం షూటింగ్ ను గోవా లో షురూ చేసింది. ప్రస్తుతం ఫైట్ సీన్ తో గోవా లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ లో మహేష్ ఫైట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ ను విడుదల చేసింది. చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :