థియేటర్ల లో మాస్ జాతర “సర్కారు వారి పాట” ట్రైలర్!

Published on Apr 30, 2022 3:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ మే 2, 2022 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్ల లో ఈ మాస్ ట్రైలర్ ను ప్రదర్శించే అవకాశం ఉంది. మాస్ కంటెంట్ తో వస్తున్న ఈ ట్రైలర్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :