‘యన్టీఆర్‌’కి పోటీ ఆయనే – సూపర్ స్టార్ !

Krishna

ఆ రోజుల్లో తెలుగు సినీపరిశ్రమలో ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్’కి పోటీగా నటించడమంటే ఎంతటి మహానటులైనా వణికిపోయేవారట. అయినప్పటికీ యస్వీఆర్‌ ఒక్కరే ఎన్టీఆర్ కి పోటీగా నటించేవారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయడంలో ఇద్దరికీ ఇద్దరే. ఆ పోటాపోటీ నటన తెరపై స్పష్టంగా కనిపించేదని సూపర్ కృష్ణ తెలిపారు. ఇంకా యస్వీఆర్‌ గారి గురించి చెబుతూ.. ముఖ్యంగా యస్వీఆర్‌ గారు ప్రతినాయకుడి పాత్రలోనో సహాయపాత్రగానో ఎక్కువుగా యన్టీఆర్‌ గారి చిత్రాల్లోనే నటించారు.

నిజం మాట్లాడాలంటే యస్వీఆర్‌ గారిని మనం గొప్పగా చెప్పుకున్నే హాలీవుడ్‌ నటులతో కూడా పోల్చకూడదు. ఎందుకంటే, యస్వీఆర్‌ గారిలా వైవిధ్యభరితమైన పాత్రలును అద్భుతంగా పోషించిన నటులు హాలీవుడ్‌లో కూడా లేరు. యస్వీఆర్‌ లాంటి మహానటుడు ఇప్పటి వరకు రాలేదు భవిష్యత్తులో కూడా వస్తాడని చెప్పలేం అని సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

Exit mobile version