టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ కోవలోనే వచ్చిన క్లాసిక్ మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం 2013 జనవరి 11న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ముల లాగా నటించారు.
తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినీ సర్కిల్స్‌లో ఈ చిత్ర రీ-రిలీజ్ పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని ఖచ్చితంగా రీ-రిలీజ్ చేయాలని ప్రేక్షకులతో పాటు సినీ లవర్స్ కూడా కోరుతున్నారు. దీంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే, మార్చి 7న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.