‘స్వాగ్’ థియేట్రిక‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న ఏషియ‌న్ సురేష్‌

‘స్వాగ్’ థియేట్రిక‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న ఏషియ‌న్ సురేష్‌

Published on Jun 24, 2024 2:01 PM IST

యంగ్ హీరో శ్రీ‌విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీ‌విష్ణు గెట‌ప్ కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

ఇక కాన్సెప్ట్ కూడా కొత్త‌గా అనిపిస్తుండ‌టంతో ‘స్వాగ్’ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆల్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్టైన్మెంట్ ద‌క్కించుకుంది.

దీనికి సంబంధించి ‘స్వాగ్’ చిత్ర నిర్మాత సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ తాజాగా అఫీషియ‌ల్ స్టేట్మెంట్ ను ఇచ్చింది. ఇక ఈ సినిమాలో రీతూ వ‌ర్మ‌, మీరా జాస్మిన్, ద‌క్షా నాగ‌ర్క‌ర్, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, హ‌సిత్ గోలి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు