‘ప్రాజక్ట్ – కె’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన నిర్మాత స్వప్న దత్

Published on May 6, 2023 10:28 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇక ఆయన తాజాగా చేస్తున్న సినిమాల్లో భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ప్రాజక్ట్ – కె కూడా ఒకటి. నాగ అశ్విన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రాజక్ట్ కె మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా విషయం ఏమిటంటే, తాజాగా తమ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపొందిన అన్నీ మంచి శకునములే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రాజక్ట్ కె మూవీ గురించి నిర్మాత స్వప్న దత్ మాట్లాడారు. ఇప్పటికే సినిమా 70 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుందని, హాలీవుడ్ కి చెందిన ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థలు దీనికి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నాయని అన్నారు. ఇక ప్రాజక్ట్ కె అనేది వర్కింగ్ టైటిల్ కావడంతో అసలు టైటిల్ ని సరైన టైం వచ్చినపుడు ప్రకటిస్తాం అని తెలిపారు. కాగా ప్రాజక్ట్ కె మూవీని 2024 జనవరి 12న భారీగా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం :