బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్

Published on Sep 30, 2022 1:00 am IST

నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా యువ దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇప్పటికే సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరపరిచిన సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 2న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. లవ్, రొమాంటిక్, ఫామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కగా అన్ని వర్గాల ఆడియన్స్ ని తమ మూవీ ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన స్వాతిముత్యం మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :