స్వాతి రెడ్డి ‘మంత్ ఆఫ్ మధు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Sep 11, 2023 7:00 pm IST

నటి స్వాతి రెడ్డి కొంత గ్యాప్ తరువాత తాజాగా హీరోయిన్ గా నటించిన మూవీ మంత్ ఆఫ్ మధు. ఇటీవల భానుమతి & రామకృష్ణ మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నటుడు నవీన్ చంద్ర, దర్శకుడు శ్రీకాంత్ నాగోతి జోడి కలిసి మరొక్కసారి చేస్తున్న మూవీనే మంత్ ఆఫ్ మధు. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ మూవీలో నవీన్, స్వాతి ల రోల్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని అంటోంది యూనిట్.

తమ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువస్తున్నట్లు వారు కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని, శ్రేయ నవేలి, జ్ఞానేశ్వరి కండ్రేగుల, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న మంత్ ఆఫ్ మధు మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా కృషివ్ ప్రొడక్షన్ మరియు హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ సంస్థల పై యస్వంత్ ములుకుట్ల ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :