‘స్వాతిముత్యం’ సెన్సార్ కంప్లీట్, రన్ టైం లాక్ ….!

‘స్వాతిముత్యం’ సెన్సార్ కంప్లీట్, రన్ టైం లాక్ ….!

Published on Sep 30, 2022 10:00 PM IST


యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతూ లేటెస్ట్ గా తెరకెక్కిన మూవీ స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిమించగా లక్ష్మణ్ కె కృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ తో అందరిలో మూవీ మంచి అంచనాలు ఏర్పరిచింది స్వాతిముత్యం. మంచి రొమాంటిక్, లవ్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన తమ మూవీ ఇంటిల్లిపాది చక్కగా చూసి ఎంజాయ్ చేయవచ్చని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు వారు ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ కేటాయించారు. అలానే మూవీ రన్ టైం 2 గంటల 4 నిముషాలు. సినిమా యొక్క నిడివి తక్కువగా ఉండడం కూడా దీనికి కలసివచ్చే అంశంగా కనపడుతోంది. మరి అక్టోబర్ 5 న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్వాతిముత్యం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు