బిగ్‌బాస్ సీజన్ 5: విన్నర్ ఎవరో చెప్పేసిన శ్వేత వర్మ..!

Published on Oct 23, 2021 2:10 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారన్నది ఇప్పటి నుంచే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, మొన్న వారం శ్వేత వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మొన్న వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన శ్వేత వర్మ ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పేసింది. ఈ సీజన్‌లో వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సభ్యుల్లో అతడు స్ట్రాంగ్‌, పాపులర్‌ కంటెస్టెంట్‌ అని చెప్పుకొచ్చింది. ఇకపోతే సన్నీ, మానస్‌, యానీ మాస్టర్‌ టాప్‌ 3లో ఉండొచ్చని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :