‘సైరా’ మొదటి షెడ్యూల్ వివరాలు !

మెగాస్టార్ యొక్క ప్రతిష్టాత్మకమైన 151వ చిత్రం ‘సైరా’ ఈరోజు ఉదయమే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మొదలైన సంగతి తెలిసిందే. సినిమా ఆరంభాన్నే పోరాట సన్నివేశాలతో మొదలుపెట్టారు చిత్ర టీమ్. ఈ షెడ్యూల్లో చిరంజీవిఫై కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

ఈ హెవీ ఫైట్స్ స్టంట్ కొరియోగ్రఫర్ లీ విట్టకేర్ సారథ్యంలో రూపొందనున్నాయి. ఈ షెడ్యూల్ నిర్విరామంగా డిసెంబర్ 22వరకు కొనసాగుతుందని సంచారం. ఈ సినిమా తమ టీమ్ మొత్తానికి మర్చిపోలేని జర్నీ అవుతుందని చిత్ర నిర్మాత రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. రూ.150 కోట్ల బడ్జెట్ తో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్ నటీ నటులు నటిస్తున్నారు.