అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్న మెగాస్టార్!


మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. 1840ల కాలంలో జీవించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు నిర్మాత రామ్ చరణ్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తైపోగా సెట్టింగ్స్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్.

మరోవైపు బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ అంజు మోడీ నేతృత్వంలో చిరు కోసం కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ రెండవ వారం నుండి మొదలుపెట్టనున్నారు. అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్ నటీ నటులు నటించనున్న ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.