బిగ్ బాస్ 7 : ఈ కంటెస్టెంట్ కి బాగా వర్కవుతున్న సింపతి కార్డ్..

Published on Sep 12, 2023 3:30 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో కోసం అందరికీ తెలిసిందే. మరి తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లు సూపర్ సక్సెస్ గా కంప్లీట్ అయ్యి ఈసారి 7వ సీజన్లోకి వచ్చేసింది. మరి ఇలా రావడంతోనే మొదటి రోజు నుంచే మంచి డ్రామా అయితే హౌస్ లో స్టార్ట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఆల్ మోస్ట్ అంతా సినీ సీరియల్స్ నటీనటులు హౌస్ లోకి అడుగు పెట్టగా వారితో పాటుగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ కూడా వచ్చాడు.

అయితే రైతు బిడ్ద అంటూ వచ్చిన తాను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోని అలాగే వీక్షకుల్లో కూడా ట్రెండింగ్ గా మారాడు. అయితే తనపై మొదటి నుంచి సింపతి మేకర్ గా కామెంట్స్ ఉండగా ఇప్పుడు హౌస్ లో వాతావరణం మరింత రసవత్తరంగా మారడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు తన ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

అంతే కాకుండా ఎక్కువ సీరియల్ ఆర్టిస్ట్స్ అంతా ఒకవైపు తాను ఒక వైపు తక్కువ సపోర్ట్ తో ఉండడంతో తనపై ఎక్కువ సింపతి వర్క్ అవుతుంది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అందరిలో ఎక్కడో ఓ సాఫ్ట్ కార్నర్ అయితే మొదలవుతుంది. మరి ఈ డ్రామా అంతా ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా స్టార్ మా మరియు హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.

సంబంధిత సమాచారం :