
మోడలింగ్ రంగం నుండి చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన తారలలో ఢిల్లీ గర్ల్ తాప్సీ ఒకరు. మోడలింగ్ కెరీర్ ఆరంభంలో రిలయన్స్ ట్రెండ్స్, 93.5 రెడ్ ఎఫ్.ఎం. వంటి పలు అగ్ర సంస్థలకు తాప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అవి ఆమెకు పేరు తీసుకురావడంతో పాటు చిత్ర పరిశ్రమలో ప్రవేశించడానికి బాటలు వేసింది. హీరోయిన్ అయిన తర్వాత తాప్సీ, పెద్దగా వాణిజ్య ప్రకటనలపై దృష్టి పెట్టలేదు. హిందీలో ‘బేబీ’ విజయంతో అందరి కన్ను తాప్సీపై పడింది. ప్రస్తుతం ఆమెకు పలు ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ‘ఎవర్ యూత్’ బ్యూటీ & కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి తాప్సీ అంగీకరించింది. ఇటివలే యాడ్ షూటింగ్ కంప్లీట్ చేసింది. త్వరలో మరిన్ని సంస్థలు తాప్సీను సంప్రదించే అవకాశం ఉంది.