ఓటీటీలోకి తాప్సీ కోర్ట్ రూమ్ డ్రామా ‘అస్సీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

అందాల భామ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘అస్సీ’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించగా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలను కూడా పొందింది.

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాధితులపై చూపే వివక్షను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో తాప్సీ ఒక ధైర్యవంతురాలైన న్యాయవాదిగా తన నటనతో ఆకట్టుకోగా, మలయాళ నటి కని కుస్రుతి బాధితురాలి పాత్రలో ఒదిగిపోయి అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మానసిక క్షోభను, న్యాయం కోసం చేసే పోరాటాన్ని గౌరవ్ సోలంకి మరియు అనుభవ్ సిన్హా తమ రైటింగ్‌తో చాలా డెప్త్‌తో ప్రెజెంట్ చేశారు.

ఇక ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఏప్రిల్ 17 నుండి వీక్షించే అవకాశం ఉంది. అయితే, ఈ చిత్రం ప్రస్తుతం హిందీ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version