తాప్సీ బాడీ పై నెటిజన్ ఘాటు మెసేజ్ !

Published on Sep 21, 2021 10:17 am IST

హీరోయిన్ తాప్సీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక నెటిజన్లతో కూడా ఆమె ఎప్పుడు టచ్ లో ఉంటుంది. కాగా తాప్సీ మెయిన్ లీడ్ లో నటిస్తున్న కొత్త సినిమా ‘రష్మీ రాకెట్‌’. ఈ సినిమాలో తాప్సీ గుజరాతీ స్పింటర్‌ రష్మీ పాత్రలో నటిస్తోంది. అయితే, మంచి అథ్లెట్‌ బాడీ కోసం తాప్సీ చాలా కష్ట పడింది. బాగా వర్కౌట్స్ చేసి తనను తాను పూర్తిగా మార్చుకుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తానూ వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ ‘ఎవరో చెప్పుకోండి?’ అంటూ తాప్సీ ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. అయితే ఓ నెటిజన్‌ ‘ఇలాంటి బాడీ తాప్సీకి మాత్రమే ఉంటుంది’ అంటూ వ్యంగ్యంగా మెసేజ్ పెట్టాడు. ఆ కామెంట్‌కి స్పందించిన తాప్పీ ‘సెప్టెంబర్ 23 వరకు ఈ లైన్ గుర్తుపెట్టుకో, నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. నీకు ధన్యవాదాలు’ అంటూ ఆమె కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ఇక లక్ష్మీ మంచుతో పాటు ఎంతో మంది అభిమానులు తాప్సీకి సపోర్టుగా కామెంట్స్‌ పెట్టడం విశేషం.

సంబంధిత సమాచారం :