అభిమాని వివాహానికి హాజరుకానున్న స్టార్ హీరోయిన్ !

20th, February 2017 - 05:50:22 PM


ప్రముఖ నటి, ప్రస్తుతం హిందీలో స్టార్ హీరోయిన్ గా మన్ననలు పొందుతున్న తాప్సి తన అభిమాని విజ్ఞప్తి మేరకు అతని వివాహానికి హాజరుకానుంది. సికింద్రాబాద్ కు చెందిన ఆ అభిమాని వివాహం వచ్చే నెలలో జరగనుంది. రెగ్యులర్ గా ఈమెయిల్స్, చాటింగ్ ద్వారా టచ్ లో ఉండే ఈ అభిమానికి తాప్సి అంటే ఎనలేని గౌరవమట. అంతేగాక అతను తాప్సి ఫాన్స్ క్లబ్ లో అధికారిక సభ్యుడట. ఎప్పుడు తాప్సిని గౌరవ సూచనకంగా మాట్లాడుతూ ఆమెతో చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తుంటాడట.

అందుకే అతనంటే తనకు కూడా అభిమానమని, అతను తన వివాహానికి రావలసిందిగా ఆహ్వానించాడని, ఓకే చెప్పానని, తన అభిమాని కోసం ఒక రోజు కేటాయించి పెళ్ళికి హాజరవుతానని అన్నారు తాప్సి. ఇకపోతే తాప్సి నటించిన తాజా చిత్రం ‘ఘాజి’ విడుదలై ఘన విజయం సాధించగా ఆమె నటించిన మరో హిందీ చిత్రం ‘రన్నింగ్ షాదీ. కామ్’ కూడా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.