తాప్సీ హిందీ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్!

pink
తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు ప్రధాన భాషల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ, గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ అనే బాలీవుడ్ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలైంది. బాలీవుడ్‌లో దర్శకుడిగా ఓ ప్రత్యేక బ్రాండ్ సంపాదించుకున్న సుజీత్ సర్కార్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి షో నుంచే అన్నివర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది. అనిరుద్ధా రాయ్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ షోను హైద్రాబాద్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలకు ప్రదర్శించారు. రానా, సుధీర్ బాబు, సుశాంత్, అల్లు శిరీష్, రాశిఖన్నా తదితరులు ఈ షోకు ప్రత్యేకంగా హాజరై తాప్సీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షోలో కూడా తాప్సీ నటించిన సినిమాతో పాటు ఆమె నటనకు కూడా సెలెబ్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో ‘బేబీ’తో మంచి హిట్ కొట్టిన తాప్సీ, ఇప్పుడు ‘పింక్‌’తో మరోసారి పాపులర్ అయిపోయారు.