తాప్సీ “శభాష్ మిథు” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Apr 29, 2022 2:00 pm IST

ఇటీవల తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తదుపరి భారీ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శభాష్ మిథు అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ భారత క్రికెటర్ మిథాలీ రాజ్ గురించి.

ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంను జూలై 17, 2022న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. వయాకామ్ 18 స్టూడియోస్ మరియు కొలోస్సియం మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌మోష‌న్ కంటెంట్ సినిమాపై హైప్‌ని పెంచింది.

సంబంధిత సమాచారం :