మహేష్ సినిమాలో ‘టబు’ కీలక పాత్ర ?

Published on Dec 18, 2022 10:04 pm IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నటీనటులను కూడా పాన్ ఇండియా స్టార్స్ నే తీసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ ను లవ్ లో పడేయడానికి ట్రై చేసే ఓ ఆంటీ పాత్ర ఉందట. ఇప్పుడు ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు నటిస్తోంది అని పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో టబు నటించింది. మరి ఆ పరిచయంతో ఆమె ఈ పాత్రలో నటిస్తోంది ఏమో చూడాలి.

ఇప్పటికీ అయితే, మహేష్ సినిమాలో టబు పాత్ర పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :