కొండ పొలం నుండి “తల ఎత్తు” లిరికల్ రేపే విడుదల!

Published on Oct 4, 2021 3:30 pm IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కొండ పొలం. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు, విడియో లు ఇప్పటికే సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి ఇప్పుడు మరొక లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి తల ఎత్తు అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రేపు సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రకటన సైతం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :