నెట్‌ప్లిక్స్‌లోకి “తలైవి” హిందీ వెర్షన్..!

Published on Sep 25, 2021 2:25 am IST


తమిళనాడు దివ‌గంత ముఖ్యమంత్రి, న‌టి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “తలైవి”. జయలలితగా కంగనా నటించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తలైవి హిందీ వెర్షన్ నేటి నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో అర‌వింద‌స్వామి, క‌రుణ‌నిధి పాత్ర‌లో నాజ‌ర్‌, ఆర్‌.ఎం.వీర‌ప్ప‌న్ పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని చాలా చక్కగా నటించారు.

సంబంధిత సమాచారం :