నాగ చైతన్య కొత్త సినిమాలో ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్

naga-chaitanya1
అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు అక్టోబర్ నెల రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈలోపే చైతు మరో సినిమాని ప్రారంభించబోతున్నాడు. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ నాగార్జున కెరీర్లో క్లాసిక్ గా నిలిచిన ‘నిన్నేపెళ్లాడతా’ తరహాలో ఉంటుందని కూడా తెలిసింది. అయితే తాజాగా జరిగిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ప్రెస్ మీట్లో ఈ చిత్రం గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు నాగార్జున.

అవేమంటే ఇందులో ముగ్గురు టాలెంటెడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని, ఇది చైతు కెరీర్లో క్లాసిక్ గా నిలుస్తుందని అన్నారు. ఇంతకీ ఆ ముగ్గురు టాలెంటెడ్ నటులు ఎవరంటే ఒకరు జగపతిబాబు, రెండవది రావు రమేష్ కాగా మరొకరు సంపత్. జగపతిబాబు, రావు రమేష్ లు ఇద్దరూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ నటులుగా కొనసాగుతుండగా సంపత్ కూడా తెలుగు, తమిళ, మళయాళ పరిశ్రమల్లో బిజీ నటుడిగా చలామణీ అవుతున్నాడు. ఇకపోతే పాపులర్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.