‘రామ్ చరణ్’ సినిమాకి అతను మంచి ప్లస్ అవుతాడు !

20th, August 2016 - 12:39:37 PM

Cinematographer-Manoj-Param
ప్రస్తుతం ‘ధృవ’ షూటింగ్ లో బిజీగా ఉన్న ‘రామ్ చరణ్’ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవగానే నవంబర్ లో ‘సుకుమార్’ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబందించి కాస్ట్ అండ్ క్రూ ను నిర్ణయించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ‘మనోజ్ పరమహంస’ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

మనోజ్ పరమహంస గతంలో ‘ఏ మాయ చేసావే, రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించి వాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కనుక ఇతను చరణ్ సినిమాకి ఖచ్చితంగా మంచి ప్లస్ అవుతాడని దర్శకనిర్మాతలు భావియిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించనుంది.