ఎన్టీఆర్ కోసం కుటుంబ కథ రెడీ చేసిన దర్శకుడు


ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ విడుదలకు సిద్ధం అవుతోంది. తన తదుపరి చిత్రాల కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం వివిధ దర్శకుల కథలు వింటున్నట్లు సమాచారం. తాజాసమాచారం ప్రకారం ఎన్టీఆర్ కు ఓ దర్శకుడు కుటుంబ కథని వివరించినట్లు తెలుస్తోంది. శతమానం భవతితో సూపర్ హిట్ అందుకున్న సతీష్ విజ్ఞేశ ఎన్టీఆర్ కోసం ఫ్యామిలీ స్టాటిని సిద్ధం చేయడం, ఎన్టీఆర్ కు కథని వినిపించడం జరిగిందట.

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్, దిల్ రాజు కాంబినేషన్ లో ఇప్పటికే బృందావనం వంటి హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మరో మారు ఈ హిట్ కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులు ఆసక్తిగా ఉంటారనడంలో సందేహం లేదు.