టాక్..సంక్రాంతి భారీ సినిమాల్లో ఒకటి డౌటేనా.?

టాక్..సంక్రాంతి భారీ సినిమాల్లో ఒకటి డౌటేనా.?

Published on Oct 23, 2022 10:00 AM IST

మన టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ వస్తుంది అంటే సినిమా సందడి కూడా ఉంటుంది. మరి అలా ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పుడు నుంచే టాలీవుడ్ లో వాతావరణం వేడెక్కింది. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ అయితే ప్రభాస్ ఆదిపురుష్, మెగాస్టార్ 154, విజయ్ వారసుడు అలాగే బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రాలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఏది కూడా తక్కువ కాదు దీనితో ఆ రిలీజ్ టైం నాటికి మాత్రం చాలా సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరి అలాంటివి ఏవి ఉండకూడదు అంటే ఈ నాలుగింటిలో డెఫినెట్ గా ఓ సినిమా వెనక్కి తగ్గితేనే బెటర్ అని అంటున్నారు. దీనితో ఆ చిత్రం ఏంటి అని అంతా ఎదురు చూస్తున్నారు. బాలయ్య సినిమా మినహా మిగతా చిత్రాలు అన్నీ కూడా ముందే సంక్రాంతి విడుదల అనౌన్స్ చేసాయి. మరి మెగాస్టార్ సినిమా కూడా కాస్త అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. మరి ఈ చిత్రాల్లో అయితే ఏది ముందే వస్తుందో ఏది వెనక్కి తగ్గుతుందో అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు