టాక్..”సలార్” పై మాసివ్ అప్డేట్ రాబోతోందా.?ఎప్పుడంటే

Published on Jul 30, 2022 6:10 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఇండియన్ సినిమా దగ్గరే ఒక బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా చేస్తున్న చిత్రం “సలార్” కూడా ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. పైగా ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఒక ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా కొత్త టాక్ వినిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి కూడా సలార్ టీజర్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మరి ఈ టీజర్ పై కానీ వేరే ఏదొక అంశంపై ఈ ఆగస్ట్ లోనే ఓ మాసివ్ అప్డేట్ ఉండొచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రీట్ ఉండనుంది అని టాక్. మరి దీనిపై అయితే ఇంకా సరైన సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :