టాక్..అజిత్ నెక్స్ట్ సినిమా ఆగిపోయిందా?

Published on Jan 29, 2023 8:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “తునివు” కోసం తెలిసిందే. ఈ చిత్రం అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి వలిమై ని దాటి మరింత స్థాయి వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది. మరి వరుస హిట్స్ అందుకున్న అజిత్ నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ చిత్రంపై లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల్లో కాస్ట్ గందరగోళం నెలకొంది.

నిజానికి ఈ చిత్రాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించనుండగా ఆల్రెడీ ఈ చిత్రం అనౌన్స్ కూడా అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. హీరో అజిత్ గాని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ గాని విగ్నేష్ కంప్లీట్ స్క్రిప్ట్ పై అంత సంతృప్తి గా లేరని అందుకే విగ్నేష్ తో సినిమా ఉండకపోవచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అసలు క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :